These varnams have a natural flow of aesthetic sancharas and are easy to learn as compared to the traditional varnams yet fulfilling the basic objective of rigorous practice required to attain a good voice culture.
The typical scintillating swara prayogas make the raga swarupa easily comprehensible.
One speciality of this book is the inclusion of Varnams in two Swarantara ragas (ragas containing only 4 swaras). These are the First of the kind in the history.
వర్ణము సంగీతాభ్యాసమునందు ఒక ముఖ్య సోపానము. శారీరము స్వాధీనమగుటకు మిక్కిలి అనువైన ప్రక్రియ. అంతేగాక రాగస్వరూపము తెలుసుకొనుటకునూ, మనోధర్మసంగీతమును పెంపొందించుకొనుటకునూ వర్ణము సమగ్రమైన మార్గదర్శి. ప్రాచీన కాలపు వర్ణ రచయితలు తమ రచనల యందు సాహిత్యము బహుకొద్దిగా నుంచి అకార సాధనయే ధ్యేయముగా నుండునట్లేర్పరచిరి ఈ రచనలు ప్రామాణికములుగా నేటికి గానము చేయబడుతున్న అద్భుత రచనలు. నిశితముగా పరిశీలించిన ఈ వర్ణ కల్పనలో కొన్ని మార్పులు చేసిన వర్ణములింకను రసవత్తరము లగుననీ, నేర్చుకొనుటకు సరళములుగా నుండునని భావన కల్గినది. తత్ప్రయత్నమే ఈ నవ్యతాన వర్ణముల సృష్టికి కారణము.
ఈ మొదటిది వర్ణసాహిత్యంలో ఒక వస్తు సంవిధానమును ప్రవేశపెట్టిన ప్రస్తుత వర్ణ సాహిత్య స్థాయి కృతి స్థాయికి చేరునని ఆలోచన కల్గినది. ఆ ప్రయత్నంలో మొదటి సారిగా “నళిన కాంతి" యను రాగము నందు వర్ణము రచించితిని. అప్పట్లో ఆ రాగమునందు వర్ణములు లేకుండుటే ఆ రాగము ఎన్నుకొనుటకు కారణము.
రెండవది వర్ణమునందలి స్వర రచన సహజ ప్రవాహము వలె నున్నప్పుడు వర్ణములు సరళములై నేర్చుకొనుటకు మరింత సుగమమగుననిపించింది. అట్లే వర్ణము నందలి ఉత్తర భాగమునందు చరణ స్వరముల పొందిక చరణ సాహిత్యమును ఇనుమడింపచేయుచూ రసస్ఫూర్తి కలుగునట్లుండిన బాగుండుననిపించినది.
మూడవది గానముచేయు స్థాయి పరిధి పూర్తి రెండు స్థాయిలుగా అనగా మంద్ర పంచమమునుండి తార పంచము వరకు తప్పని సరిగా నుండ వలెనని ఆ రీతిగా స్వరముల కల్పన చేసితిని.
ఈ మార్పులతో కల్పించిన నళిన కాంతి వర్ణమునకు సంగీతజ్ఞులనుండి, రసికుల నుండి లభించిన స్పందనతో ఉత్సాహము, ధైర్యము పెరిగి మరి కొన్ని ప్రత్యేకముగా ఎన్నుకొన్న జన్యరాగములలో వర్ణములు కల్పించితిని.
శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ స్వరాంతర రాగములలో కల్పించిన స్ఫూర్తితో ఇట్టి స్వరాంతర రాగములలో వర్ణములెందుకుండరాదను ఆలోచనగల్గి మహతి మరియు లహరి యను రెండు స్వరాంతర రాగములందు వర్ణముల రచించితిని.
ఇట్లు కల్పించిన పది వర్ణముల సంకలనమే ఈ నవ్యతాన వర్ణములు అను పుస్తకము.
విద్యార్థులు, విద్వాంసులు ఈ వర్ణముల పరిశీలించి, గానము చేసి ప్రాచుర్యములోనికి "దెచ్చి నా ప్రయత్నమునందు కృతార్థునిగా చేయప్రార్థించిచున్నాము. ఆ పరాత్పరి నా కింకనూ కళామతల్లిని సేవించు భాగ్యమును ప్రసాదింప వేడుకొంటూ
ఇట్లు
భవదీయుడు,
నల్లాన్ చక్రవర్తి మూర్తి
No comments:
Post a Comment