About this work...
Ghana Raaga Varna Panchakam containing Pada Varnams in the five Ghanaragas is a novel creation. After composing Tana Varnams in the 72 Mela Kartas I was inspired to compose varnams in the Ghanaragas. In the process, it came to my notice that Pada Varnams have not been composed by any of the earlier composers. Hence, I embarked on this task and by the grace of Almighty, my effort fructified into this booklet. All these Pada Varnams are devotional in nature with the Nata Raga Varnam devoted to Omkara Rupa, Gowla to Lord Ganesha, Arabhi to Mahadeva Sambho, Varali to Goddess Saraswati, and Sri Ragam to Mahaniya Guru.
I have shown these varnams to Sadguru Sri
Sri Sri Sivananda Murthy garu and to my
guruji Mahamahopadhyaya Prof. (Dr.) Nookala
China Satyanarayanagaru who have kindly given their blessings. I
pray the Almighty for due propagation of these
Pada Varnams through students, Vidwans
and Music lovers.
- Nallan Chakravarthy Murthy
ఈ గ్రంథం గురించి...
"ఘనరాగవర్ణపంచకమ్ అను ఈ చిన్ని గ్రంథములోని వర్ణములుఒక వినూత్న ప్రక్రియ. 72 మేళకర్తలలో తానవర్ణములు రచించిన పిదప ఘనరాగములలో వర్ణ రచన చేయ సంకల్పము గలిగెను. తత్ప్రయత్నమున యింతకు పూర్వము ఘనరాగములందు తానవర్ణములు ఉన్నప్పటికినీ, పదవర్ణములు రచింపబడలేదను విషయము గమనమునకు వచ్చినది. దీనితో నాదృష్టి పద వర్ణముల పైకి మళ్ళి, ఆ భగవత్ కృప వలన నా ప్రయత్నము ఫలవంతమయ్యెను. నాట రాగమునందు ఓంకార రూపుడైన
సర్వేశ్వర పరముగాను, గౌళలో గణేశ పరముగాను, ఆరభి యందు మహాదేవ పరముగాను, వరాళిలో సరస్వతి పైననూ, శ్రీ రాగంలో మహానీయుడైన గురుపరముగాను పదవర్ణములు వెలువడినవి.
ఈ వర్ణములు సద్గురువులు శ్రీ శ్రీ శ్రీ శివానందమూర్తిగారికి మద్గురువర్యులు 'మహామహోపధ్యాయ' ప్రొఫెసర్ డా|| నూకల చినసత్యనారాయణ గారికిన్నీ చూపించి వారి ఆశీస్సులు పొందితిని. విద్యార్థులు, విద్యాంసులూ మరియు సంగీత రసికులూ నా యీ ప్రయత్నమును సహృదయతతో నాదరించి ఈ పద వర్ణములు ప్రాచుర్యములోనికి తెచ్చుటకు తోడ్పడుటకై ప్రార్థించుచున్నాను."
ఇట్లు
విధేయుడు
నల్లాన్ చక్రవర్తి మూర్తి
INDEX OF GHANA RAGA VARNAMS
(Click on the Ghanaragam title to listen to the audio file)
# | ఘనరాగ వర్ణము | ఘనరాగము | తాళము |
---|---|---|---|
1 | ఓంకార రూపా | నాట | ఆది |
2 | శ్రీ గణేశాత్పరం | గౌళ | ఆది |
3 | శ్రీ మహాదేవ శంభో | ఆరభి | ఆది |
4 | వాగధీశ్వరీ | వరాళి | ఆది |
5 | మహనీయుడౌ | శ్రీరాగం | ఆది |
No comments:
Post a Comment